వికారాబాద్ జిల్లా పరిగిలో కొందరు వ్యక్తులు రోజా ట్రేడర్స్ పేరిట ఘరానా మోసానికి తెరలేపారు. 40 శాతం డిస్కౌంట్ అంటూ, ఆర్డర్‌పై సప్లై చేస్తామంటూ జనాల దగ్గర డబ్బులు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. తమిళనాడుకు చెందిన కొందరు రోజా ట్రేడర్స్ పేరుతో ఓ షాపు ఓపెన్ చేశారు. ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు, హోంనీడ్స్, మొబైల్స్‌పై డిస్కౌంట్ పేరుతో జనాల వద్ద డబ్బులు వసూలు చేశారు. ఆర్డర్ చేసిన పది రోజులకు డెలివరీ చేస్తామని నమ్మబలికారు. కొత్తలో కొందరికి వస్తువులు ఇచ్చి మరి కొందరిని ఆకర్షించి డబ్బులు వసూలు చేశారు.
డబ్బులు కట్టిన వ్యక్తులు తమ వస్తువులు తీసుకునేందుకు షాప్ దగ్గరకు రాగానే మూసిఉన్న షాపును చూసి అవాక్కయ్యారు. పెద్ద సంఖ్యలో బాధితులందురు షాపు ముందుకు చేరుకున్నారు. దాదాపు కోటి వరకు డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం. బాధితుల ఆందోళనతో షాపు దగ్గరకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: తలను గోడకు బాదుకొని... టీచరే కొట్టిందని చెప్పింది..