వికారాబాద్ జిల్లాలో మాజీమంత్రి చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి వరినాట్లు వేశారు. రాంజేంద్రనగర్లోని వరి విత్తన సంస్థ నుంచి తెచ్చిన తెలంగాణ సోనా రకాన్ని నాటారు. పూర్తి సేంద్రీయ పద్ధతిలో పంట పండిస్తున్నట్లు ఆయన తెలిపారు.
ఈ వరి రకంలో గ్లూకోజ్ శాతం తక్కువగా ఉండటం వల్ల టైప్-2 డయాబెటిస్ నియంత్రణలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తుందని వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అర్జించవచ్చునని పేర్కొన్నారు. అన్నదాతలు కూడా ఈ రకం వగడంను విత్తుకోవాలని సూచించారు.