వికారాబాద్ జిల్లాలోని తాండూర్ మండలం మల్రెడ్డిపల్లి, మల్కాపూర్, పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామాలల్లో భారీ వర్షం కురిసింది. ఆయా గ్రామాల్లో వరద నీరు పెద్దఎత్తున చేరి... వీధులు జలమయంగా మారాయి. అంతర్గత రోడ్లు కాల్వలను తలపించాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. దీంతో గ్రామస్థులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.
పంటను కూడా వరద ముంచెంది. కంది, మినుము, పెసర నీట మునిగాయి. వాగులు పొంగిపొర్లడం వల్ల పలు చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలో అత్యధికంగా మోమిన్‌పేట్‌లో 93.4 మిల్లీమీటర్లు, వికారాబాద్ 24.2, పెద్దేముల్ 60, తాండూర్ 32.4, బంట్వారం 40, నవాబ్‌పేట్ 22.8, మర్పల్లి 17.2, బషీరాబాద్‌లో 24.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది
ఇదీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?