వర్షాలు పడుతున్నా ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయలేదని వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో రైతులు శనివారం ఆందోళనకు దిగారు. పెద్దేముల్ మండలం ఘాజీపూర్, యాలాల మండలం లక్ష్మీనారాయణపూర్, తాండూరు పట్టణ సమీపంలోని రైస్ మిల్లుల ఎదుట బైఠాయించారు. కాంగ్రెస్, తెదేపా, సీపీఐ, సీపీఎం ధర్నాకు మద్దతు పలికాయి. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు, నాయకులు డిమాండ్ చేశారు.
కొనుగోలు కేంద్రాల్లో వసతులు లేక ధాన్యం వాననీటిలో తడిసి ముద్దవుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పోలీసులు రైతులతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రైతులు ససేమిరా అనడం వల్ల ఉన్నతాధికారులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు.
ఇదీ చదవండి: Harish rao: 'ప్రాణమున్నంత వరకు కేసీఆర్ మాట జవదాటను'