వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యాన్ని రోడ్డుపై కుప్పగా పోసి.. నిప్పుపెట్టి నిరసన తెలిపారు. వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గన్నీబ్యాగ్‌లు ఇవ్వడం దగ్గర్నుంచి.. డబ్బులు చేతికందే వరకు దోపిడీ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
పదిహేను రోజుల క్రితం పంటను తెచ్చి కొనుగోలు కేంద్రం వద్ద కుప్పలుగా ఉంచామని రైతులు తెలిపారు. అకాల వర్షాలకు వరి ధాన్యం తడిచి మొలకెత్తుతోందని తాము తీవ్రంగా నష్టపోతామని గోడు వెల్లబోసుకున్నారు. పోలీసులు ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేయగా.. ఓ రైతు ఎస్సై కాళ్లపై పడి రోదిస్తూ.. ఆదుకోవాలని వేడుకోవడం అందరి మనసులను కదిలించింది.
ఇదీ చదవండి: Gang War: యువకుల గ్యాంగ్‌వార్... సీసీటీవీ ఫుటేజీలో దృశ్యాలు