ETV Bharat / state

అందని మక్కల బిల్లులు.. ఆందోళనలో అన్నదాతలు - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్నలు విక్రయించి రెండు నెలలు అవుతున్నా డబ్బులు చేతికి రావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అప్పుల వాళ్లు అడుగుతున్నారని వాపోయారు. అధికారులను అడిగితే స్పందించడం లేదని తెలిపారు.

farmers-concern-about-corn-purchase-in-market-and-they-not-get-money-since-two-months-in-vikarabad-district
అందని మొక్కజొన్నల బిల్లులు... ఆందోళనలో అన్నదాతలు
author img

By

Published : Jan 29, 2021, 4:03 PM IST

అందని మొక్కజొన్నల బిల్లులు... ఆందోళనలో అన్నదాతలు

మొక్కజొన్నలు విక్రయించిన రైతులకు బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో సుమారు 50 వేల లక్షల ఎకరాల్లో 2020లో మొక్కజొన్న సాగు చేశారు. పంట కొనుగోలు చేయడానికి ప్రభుత్వం 9 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. పంట అమ్మిన తర్వాత బిల్లుల విషయంలో జాప్యం చేస్తున్నారని... రెండు నెలలైనా డబ్బులు అందడం లేదని వాపోయారు. కొనుగోలు కేంద్రాల ముందు మొక్కజొన్న రైతులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

7 వేల మెట్రిక్ టన్నుల వివరాలు లేవు...

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొత్తం 19 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఇప్పటి వరకు 12 వేల మెట్రిక్ టన్నులకు సంబంధించిన రైతుల వివరాలు మాత్రమే ఆన్​లైన్​లో నమోదు చేశారు. మిగతా 7వేల మెట్రిక్ టన్నుల మక్కలకు సంబంధించిన రైతుల వివరాలు నమోదు కాలేదని సమాచారం.

రెండు నెలలు దాటింది...

3 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. నవంబరు 15, 16 తేదీల్లో ధరూర్ కేంద్రంలో 28 క్వింటాల మక్కలు విక్రయించాను. పంట అమ్మి రెండు నెలలు దాటింది. ఇప్పటి వరకు డబ్బులు రాలేదు. అధికారులను అడిగితే వస్తాయంటున్నారు. కచ్చితంగా చెప్పడం లేదు.

-కిష్టయ్య, రైతు

వెంటనే చెల్లించాలి...

24 క్వింటాళ్ల మొక్కలు ధరూర్ కేంద్రంలో అమ్మినం. రెండు నెలలు దాటింది. బిల్లులు ఇంకా అందలేదు. కూలీలు, ఇతర పెట్టుబడులకు అప్పు తెచ్చాం. అప్పుల వాళ్లు అడుగుతున్నారు. అధికారులు స్పందించి వెంటనే బిల్లులు చెల్లించాలి.

-అనంతయ్య, కేరెల్లి

స్పందన లేదు...

డిసెంబరు 16న ధరూర్ మార్కెట్​లో 172 క్వింటాళ్ల మక్కలు విక్రయించాను. సుమారు రూ.3 లక్షలు రావాలి. అధికారులను అడిగితే స్పందన లేదు.

-నాగిరెడ్డి, కేరెల్లి

అందరికీ డబ్బులు వస్తాయి...

మొక్కజొన్న తెచ్చిన రైతుల పేర్లు, పంట వివరాలు ఆన్​లైన్​లో నమోదు చేయడంలో సిబ్బంది అలసత్వం ప్రదర్శించారు. ఇప్పుడు తిరిగి నమోదు చేస్తున్నారు. అందరికి డబ్బులు వస్తాయి.

-మీనా, మార్క్ ఫెడ్ జీఎం.

ఇదీ చదవండి: బడ్జెట్‌లో ఆదాయపు పన్ను రాయితీలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.