వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణం చుట్టూ ఏర్పాటు చేస్తున్న బాహ్య వలయ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తక్కువ పరిహారం..
తాండూర్ మండలం బషీర్ మియా తండాకు చెందిన రైతులు.. తమ నుంచి ఎక్కువ భూమి తీసుకుని తక్కువ పరిహారం చెల్లించారని ఆవేదన చెందారు. ఆ రహదారిలో కోల్పోతున్న భూములను తిరిగి సర్వే చేయాలని రెవెన్యూ అధికారులను కోరారు. గతంలో తమకిచ్చిన ప్రభుత్వ భూములతో పాటు.. పట్టా భూములను కూడాఅధికారులు తమ నుంచి తీసుకున్నారని రైతులు వాపోయారు.
న్యాయం చేయండి..
తమకున్న అరకొర భూములను తీసుకుని తక్కువ పరిహారం చెల్లించినా అధికారులు చోధ్యం చూస్తున్నారన్నారు. బతకడానికి ఒకే ఒక ఆధారమైన భూములు తీసుకోవడంతో కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని వాపోయారు. తమ భూముల నుంచి కాకుండా పక్కనే ఉన్న గుట్ట పక్కనుంచి బాహ్య వలయ రహదారిని ఏర్పాటు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. లేదంటే ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'కొనుగోలు భద్రత ఉన్న ఏకైక పంట పామాయిలే'