ETV Bharat / state

కరోనా ఆంక్షలు... పెనవేసుకుంటున్న బంధాలు

నిన్న మొన్నటిదాకా జీవన పోరాటంలో ప్రతి ఒక్కరిదీ ఉరుకులు పరుగుల వ్యవహారం. ఇందుకు పల్లె, పట్టణం అనే తేడా లేదు. కానీ కరోనా కట్టడికి లాక్​డౌన్​ అమలులో ఉన్నందున బయట తిరిగే ఆవకాశం లేదు. ఫలితంగా దోమ మండలంలోని పలు గ్రామాల్లోని చాలా కుటుంబాల్లో ఆప్యాయతలు, అనుబంధాలు పెరుగుతున్నాయి.

families entertainment with games due to lockdown
కరోనా అంక్షలు... ఆట పాటలతో కాలక్షేపం
author img

By

Published : Mar 30, 2020, 2:34 PM IST

ఇన్నాళ్లూ పిల్లలతో ఆడాలంటే ఏదో ఒక వారాంతం మాత్రమే. కాని ప్రభుత్వాలు ఆదేశాలతో ఇప్పుడు ప్రతి రోజూ కుటుంబ సభ్యులతో కలిసి గడిపే వెసులుబాటు దొరికింది. తల్లిదండ్రులు, పెద్దవారు పిల్లలతో ఇంట్లో కూర్చుని క్యారమ్స్‌, చెస్‌, వామనగుంతలు వంటి ఆటలు ఆడుతూ వారిని ఉత్సాహ పరుస్తూ... పెద్దలు సైతం నూతన ఉత్సాహాన్ని పొందుతున్నారు.

ఒకే కుటుంబానికి చెందిన భార్యా భర్తలు వారి సంతానాన్ని తీసుకుంటే భవన నిర్మాణానికి తండ్రి, వ్యవసాయ పనులకు తల్లి, పాఠశాలకు వారి సంతానం పరుగులు తీసేది. ఇలా ఒకింటి వారే నలుదిక్కుల ఎవరి పనికి వారు వెళ్లేది. పండుగలు, పబ్బాలు, ఇతర శుభకార్యాల్లో సైతం అందరూ కలిసేది చాలా తక్కువ. ఇలాంటి వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్య మార్పులు. కరోనా మహమ్మారి ఎప్పుడు ఎవరిని కబళిస్తుందో అని దాని నివారణకు అందరూ స్వీయ నిర్బంధంలోనే ఉండాలని ప్రభుత్వాలు ఆదేశించాయి.

పిల్లా పాపా, పెద్దా చిన్నా అనే తేడా లేకుండా ఇప్పుడు అందరూ గడపదాటడానికి వీలులేని పరిస్థితి. ఏదో నిత్యావసరాలు, కూరగాయలు, మందుల కోసమే తప్ప వేరేగా బయటకు తిరిగే పనేలేదు. ఫలితంగా కుటుంబాల్లో ఆప్యాయతలు, అనుబంధాలు పెరుగుతున్నాయి.

ఇలాంటి వాతావరణం ప్రస్తుతం వికారబాద్​ జిల్లా దోమ మండలంలోని పలు గ్రామాల్లో కనిపిస్తోంది. కరోనా వచ్చి ప్రాణాలకు ముప్పు తెచ్చిందనే మాట అటుంచితే కుటుంబాల్లో మాత్రం ఆప్యాయతలు, అనురాగాలు పెంచేందుకు దోహదపడుతోందని పలువురు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: కరోనా కర్ఫ్యూలో పేదల కోసం 'కుటుంబశ్రీ' నడక

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.