ETV Bharat / state

సూక్ష్మకళలో రాణిస్తోన్న యువ కళాకారుడు.. ప్రోత్సహిస్తే అద్భుతాలు చేస్తాడటా..!

అతనో ఔత్సాహిక యువ కళాకారుడు. సూక్ష్మకళలో తనదైన శైలిలో రాణిస్తున్నాడు. నమ్ముకున్న కళ అతనికి పేరు తెచ్చింది. ప్రతిభ అతనికి బహమతులతో పాటు అవార్డులు మోసుకొచ్చింది. కానీ.. కళ కడుపు నింపలేకపోతున్నా.. తనకిష్టమైన అభిరుచిని మాత్రం వదులుకోలేదు. పేదరికం, వినికిడి లోపం కారణంగా చదువు మధ్యలోనే ఆపేసిన ఆ యువకుడు ఆర్థికంగా నిలదొక్కుకునేలా ఉపాధి కల్పిస్తే సూక్ష్మకళలో గిన్నిస్ రికార్డు సాధిస్తానంటున్నాడు. దాతలు, ప్రభుత్వం, అధికారులు ఎవరైనా స్పందించి ప్రోత్సహిస్తే అనుకున్న లక్ష్యం సాధిస్తానంటున్న సున్నపు అశోక్‌పై ఈటీవీ భారత్​ ప్రత్యేక కథనం.

Ashok
Ashok
author img

By

Published : Jan 16, 2023, 11:03 PM IST

హస్తకళ, చిత్రలేఖనం, సూక్ష్మకళలో రాణిస్తున్న సున్నపు అశోక్‌

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం యాంకి గ్రామానికి చెందిన సున్నపు అశోక్ సూక్ష్మ కళ, చిత్రలేఖనంలో అబ్బురపరుస్తున్నాడు. పనికిరాని, చవకైన వస్తువులతో కళాఖండాలు తయారుచేస్తూ మన్ననలు పొందుతున్నాడు. సుద్ధ ముక్కలతో ఎన్నో ముఖ చిత్రాల్ని ఆవిష్కరించాడు. చింత గింజలపై ప్రపంచదేశాల జెండాలు, బియ్యపు గింజలపై శివలింగం చెక్కారు. కందిపప్పుపై ఆంగ్ల అక్షరాలను చెక్కుతున్నారు. కోడిగుడ్డు పెంకులపై వివిధ రంగాల్లో రాణించిన ప్రముఖుల ముఖ చిత్రాల్ని ఆవిష్కరించాడు.

రావిచెట్టు ఆకులపై రాజకీయ నాయకులు, సంఘసంస్కర్తలు, ప్రముఖుల చిత్రాలు వేశారు. కొబ్బరిచిప్పలతో వినాయకుడు, స్కూటర్ లాంటి కళాకృతులు తయారు చేశారు. అగ్గిపుల్లలు, చొప్పబెండ్లు, ఐస్ క్రీమ్ పుల్లలు, టూత్ పిన్నులతో చార్మినార్, ఈఫిల్ టవర్, రామమందిరం లాంటి చారిత్రక కట్టడాల్ని సిద్ధం చేశారు. కాదేదీ కళాఖండానికి అనర్హం అన్నట్లు ఉచితంగా, చవగ్గా దొరికే, పనికిరాని వస్తువులతో ఔరా అనిపిస్తున్నాడు. అశోక్​కు చిన్నప్పటి నుంచి చిత్రలేఖనమన్నా, సూక్ష్మ కళన్నా చాలా ఇష్టం. మూడో తరగతి నుంచే అలాంటి బొమ్మల్ని తయారు చేసేవాడు.

వాటికి ప్రముఖుల నుంచి మన్ననలు రావడంతో ఆ కళపైనే ప్రధానంగా దృష్టి పెట్టాడు. చిత్రలేఖనం, హస్తకళ, సూక్ష్మకళలో.. అశోక్‌ రూపొందించిన కళాఖండాలు ఎన్నో బహుమతులు గెలుచుకున్నాయి. వివిధ సంస్థలు అశోక్‌ ప్రతిభకు అవార్డులతో పట్టం కట్టాయి. నమ్ముకున్న కళ ఆశోక్‌కు మంచిపేరు తెచ్చింది. బహుమతులు, పురస్కారాల్ని మోసుకొచ్చింది. కానీ అతని కడుపు మాత్రం నింపలేకపోతోంది. నిరుపేద కుటుంబం, తల్లికి క్యాన్సర్‌ పైగా అశోక్​కు వినికిడి లోపం కారణంగా భారంగానే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. తన కళను నలుగురికి పంచి ఉపాధి పొందాలని భావిస్తున్న అశోక్‌కు చేయూతనందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.