వికారాబాద్ జిల్లా పాలనాధికారి పౌసుమి బసు ఆదేశాల మేరకు పరిగి పట్టణంలోని 6 చోట్ల బారికేడ్లను తొలగించారు. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కిరాణా దుకాణాలు తెరిచి ఉంటాయని మున్సిపల్ కమిషనర్ తేజ్రెడ్డి పేర్కొన్నారు. 9 తర్వాత లాక్డౌన్ యధావిధిగా కొనసాగుతుందని అన్నారు. నిత్యావసరాల కోసం బయటకు వచ్చే వారు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించారు. దుకాణాల ఎదుట భౌతిక దూరం పాటించేలా షాపుల యజమానులు బాధ్యత వహించాలని.. లేనిచో జరిమానాతో పాటు షాపు సీజ్ చేసి కేసులు పెడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండీ... రాష్ట్రంలో వెయ్యి దాటిన కరోనా పాజిటివ్ కేసులు