ETV Bharat / state

అన్నదాతలు ఆర్థికంగా ఎదగాలి : సబితా ఇంద్రారెడ్డి

అన్నదాతలు ఆర్థికంగా ఎదగాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు. వికారాబాద్​ జిల్లా ధరూర్​లో రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు.

education minister sabitha indra reddy inaugurated rythu vedika in vikarabad district
అన్నదాతలు ఆర్థికంగా ఎదగాలి: సబితా ఇంద్రారెడ్డి
author img

By

Published : Jan 5, 2021, 7:22 PM IST

వికారాబాద్ జిల్లా ధరూర్​లో రెండు కోట్ల 50 లక్షల రూపాయలతో నిర్మించనున్న రోడ్డు పనులకు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం కోట్​పల్లి మండలం రాంపూర్, బార్వాద్ గ్రామల్లో రైతు వేదికలను ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్​తో కలిసి ప్రారంభించారు.

అన్నదాతలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. రైతే రాజు కావాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. సాగు చేసే పంటలు, సస్యరక్షణ పద్ధతులు, రైతుల ఆలోచనలు, అధికారుల సూచనలు చర్చించేందుకు రైతు వేదిక ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్ పర్సన్ సునీత రెడ్డి, వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ మోతీలాల్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: కొవిడ్​ ఆస్పత్రుల ఆవరణలోని​ గాలిలో కరోనా వైరస్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.