తొమ్మిదిరోజులపాటు ప్రత్యేక పూజలు అందుకున్న దుర్గామాత శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల రచ్చబండ వద్ద ఏర్పాటుచేసిన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి... శ్రీ వేంకటేశ్వర స్వామి పుష్కరిణి వరకు శోభాయాత్ర నిర్వహించారు. దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భజన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున ఆటపాటలతో బతుకమ్మ పాటలతో శోభాయాత్రలో పాల్గొన్నారు. దుర్గామాత కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు పూజలు అందుకున్న అమ్మవారికి బహుకరించిన చీరలను గాజులను దుస్తులను వేలంపాట నిర్వహించారు.
ఇదీ చూడండి : ఆమరణ దీక్షకైనా సిద్ధం: ఆర్టీసీ వన్ జేఏసీ