ప్రధాని మోదీ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు గ్రామాల్లో మహిళలు, యువత ఆకర్షితులై భాజపాలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని మాజీ మంత్రి డీకే అరుణ తెలిపారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అరుణ హాజరయ్యారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 18 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయని...ఇంకో 18 లక్షల సభ్యత్వాలు నమోదవుతాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు.
ఇవీ చూడండి;" ఐదు రూపాయల భోజనం ఎట్లుంది పెద్దాయన.."