వికారాబాద్ జిల్లాలో 18 మండలాలు, 565 పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 1.01 లక్షల మంది పింఛనుదారులు ఉన్నారు. ఇందులో వృద్ధులు, దివ్యాంగులు, చేనేత, బీడి కార్మికులు ఉన్నారు. కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పంచాయతీల్లో పింఛన్లను వేలి ముద్రలు లేకుండానే పంపిణీ జరుగుతోంది. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం బ్యాంకుల వద్ద నగదు తీసుకునే వారితో రద్దీ నెలకొంటోంది. దీనిని అధిగమించేందుకు ఇండియాపోస్ట్ పేమెంట్ బ్యాంకు ద్వారా నగదు అందించే సౌలభ్యం కల్పించారు. సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇతర ఏ బ్యాంకులో ఖాతా ఉన్న ఆధార్ అనుసంధానం ఉంటే ఒక రోజులో ఖాతాదారుడు రూ.10 వేలు తీసుకునే వెసులుబాటు దీని కల్పించారు. దీంతో బ్యాంకు వద్దకు వెళ్లకుండానే నగదు తీసుకుంటున్నారు.
- మొత్తం జిల్లాలో పింఛనుదారులు 1,00,289
- నగదు పంపిణీ రూ.23.29 కోట్లు
తప్పనిసరిగా మాస్కు ధరించాలి
పింఛన్లు తీసుకునేందుకు వచ్చే వృద్ధులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. కరోనా నేపథ్యంలో తపాలా సిబ్బంది ద్వారా బయోమెట్రిక్ చేతి ముద్రలు లేకుండా పింఛన్లు పొందే వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చే వరకు ఇదే విధానం ద్వారా పింఛన్ల పంపిణీ జరుగుతుంది.- కృష్ణన్, డీఆర్‌డీఓ
ఇదీ చూడండి : షేక్పేట్ తహసీల్దార్, ఆర్‌ఐను అనిశాకు పట్టించిన వ్యక్తి అరెస్టు