ETV Bharat / state

Model Market : మోడల్‌ మార్కెట్‌ నిర్మాణంలో జాప్యం.. మురుగులోనే విక్రయాలు

40 ఏళ్ల క్రితం కూరగాయల మార్కెట్ నిర్మించారు. పెరుగుతున్న జనాభాతో ఇప్పటి అవసరాలకు అనుగుణంగా మోడల్ మార్కెట్ ఏర్పాటు చేయాలనుకున్నారు. దీనికోసం రాష్ట్రంలోనే ఆదర్శ మార్కెట్​ను సందర్శించారు. నిధుల కోసం అర్జీ పెట్టుకున్నారు. రూ.1.07 కోట్లు మంజూరయ్యాయి కూడా. రెండేళ్ల క్రితం శంకుస్థాపన పడిన.. ఈ నిర్మాణం ఇప్పటి వరకు ఒక్క అడుగు కూడా పడక స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మోడల్‌ మార్కెట్‌ నిర్మాణంలో జాప్యం
మోడల్‌ మార్కెట్‌ నిర్మాణంలో జాప్యం
author img

By

Published : Aug 1, 2021, 9:18 AM IST

నాలుగు దశాబ్దాల కితం అప్పటి అవసరాలకు అనుగుణంగా వికారాబాద్‌లో కూరగాయల మార్కెట్‌ నిర్మించారు. ప్రస్తుతం పట్టణం అనూహ్యంగా విస్తరించింది. 65 వేల మంది నివసిస్తున్నారు. జిల్లా కేంద్రంగానూ మారింది. ఇప్పటి అవసరాలకు అనుగుణంగా మోడల్‌ మార్కెట్‌ నిర్మించాలని అధికారులు భావించారు. సిద్దిపేట వెళ్లి అక్కడి ఆదర్శ మార్కెట్‌ను సందర్శించి వచ్చారు. నిర్మాణానికి 14వ ఆర్థిక సంఘం (2015-16) నిధుల నుంచి రూ.1.07 కోట్లు మంజూరయ్యాయి. 2019లో ప్రజా ప్రతినిధులు శంకుస్థాపన చేశారు. తర్వాత ఇప్పటి వరకు అడుగు ముందుకు పడలేదు. చినుకు పడితే ఎటు చూసినా మురుగు, కుళ్లిన కూరగాయలు, వ్యర్థాలతో దర్శనమిస్తోంది.

శంకుస్థాపన శిలాఫలకం

లిఖితపూర్వక హామీ కోరడంతో...

నవాబుపేట్‌, ధారూర్‌, పూడూరు, కోట్‌పల్లి మరికొన్ని మండలాల రైతులకు ఈ మార్కెట్‌ ఆధారంగా నిలుస్తోంది. కొత్తగా నిర్మించే మార్కెట్‌లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రస్తుతం పాత మార్కెట్‌లో దుకాణాలు నడుపుకొంటున్న వారు డిమాండ్‌ చేశారు. నిర్మాణం పూర్తయ్యే వరకు వ్యాపారాల నిర్వహణకు ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపించాలనీ కోరారు. ఈ అంశాలపై వ్యాపారులతో పలు దఫాలు అధికారులు, ప్రజా ప్రతినిధులు చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. తమ డిమాండ్లను నెరవేరుస్తామని లిఖితపూర్వక హామీ ఇవ్వాలని వ్యాపారులు కోరుతుండటమే ఇందుకు కారణం. ప్రస్తుతం 40పైగా దుకాణాలు ఉన్నాయి. నిత్యం వందలాది మంది కొనుగోలుదారులు వస్తున్నారు. చుట్టు పక్కల ప్రైవేటు వ్యక్తులు భారీ నిర్మాణాలు చేపట్టారు. పరిసరాల్లోని రహదారులు ఎత్తుగా మారాయి. దీంతో మార్కెట్‌ స్థలం గుంతగా తయారైంది. చిన్నపాటి వర్షం కురిసినా వరద, మురుగు చేరుతోంది.

కొత్తవి నిర్మిస్తానన్నారు

"రేకుల షెడ్డును తొలగించి... కొత్తగా మోడల్‌ మార్కెట్‌ నిర్మిస్తామన్నారు. శిలాఫలకం వేసి రెండేళ్లు కావస్తోంది. 40 ఏళ్ల నుంచి ఇక్కడ దుకాణాలు నిర్వహిస్తున్నాం. కొత్తగా నిర్మిస్తే అందులోనూ మాకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరాం. ఇతరుల మాదిరిగానే అద్దె చెల్లిస్తామన్నాం. కొత్త మార్కెట్‌ నిర్మాణ సమయంలో కూరగాయలు అమ్ముకునేందుకు ప్రత్యామ్నాయంగా స్థలం చూపించాలని అడిగాం. పుర పాలకవర్గం నుంచి స్పందన లేదు. నిధులున్నా పనులు చేపట్టడంలో జాప్యం జరుగుతోంది. ప్రస్తుతం చినుకుపడితే మార్కెట్‌ అంతా బురదమయంగా మారుతోంది."

- ఓ వ్యాపారి ఆవేదన

బురదలోనే అమ్మకాలు..

" వర్షాకాలంలో మార్కెట్‌కు వెళ్లాలంటే విరక్తి కలుగుతోంది. బురద దారిలోనే గోనె సంచులు పరిచి, కూరగాయలు అమ్ముతున్నారు. కొనుగోలుదారులకైనా.. వ్యాపారులకైనా అత్యవసరమైతే కనీసం మరుగుదొడ్డి సదుపాయం లేదు. వాహనాలకు పార్కింగ్‌ స్థలం లేకపోవడంతో రోడ్డుపై పెట్టి వెళితే, పోలీసులు జరిమానాలు విధిస్తున్నారు."

- శ్రీనివాస్‌రెడ్డి, వినియోగదారుడు

రెండు నెలల్లో ప్రారంభిస్తాం

" మోడల్‌ మార్కెట్‌ నిర్మాణం పూర్తయిన తరువాత అందులోని దుకాణాల కేటాయింపులో ప్రాధాన్యం ఇవ్వాలని ప్రస్తుతం ఉన్న వ్యాపారులు డిమాండ్‌ చేస్తున్నారు. సరే అన్నాం. కానీ వారు ఈ విషయమై లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని అడుగుతుండటం సమస్యగా మారింది. అందరిని ఒప్పించి, ఒకటి రెండు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తాం. "

- మంజులారమేష్‌, పురపాలక సంఘం అధ్యక్షురాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.