వికారాబాద్ జిల్లా పరిగిలో సీఆర్పీఎఫ్ జవాన్ అదృశ్యమైన ఘటన కలకలం సృష్టిస్తోంది. పార్లమెంట్ ఎన్నికల బందోబస్తు కోసం జార్ఖండ్ నుంచి 79 మంది పరిగికి వచ్చారు. వారికి నూతనంగా ఏర్పాటు చేసిన ఆసుపత్రి భవనంలో బస కల్పించారు. నిన్న ఉదయం 7 గంటలకు బయటకు వెళ్లిన వ్యక్తి సాయంత్రం అయినా రాకపోవటం వల్ల తోటి జవాన్లు కంగారు పడ్డారు. ఉన్నతాధికారి సహాయంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి:వికారాబాద్‌కు వరుస కడుతున్న అగ్రనేతలు