ETV Bharat / state

'కేంద్రానికి భయపడి.. చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు' - రైతు వ్యతిరేక చట్టాలు

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కుల్కచర్ల మండల కేంద్రంలో.. కాంగ్రెస్ నిరసన చేపట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా.. నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Congress staged a protest against the agricultural laws In Kulkacharla Mandal vikarabd
'కేంద్రానికి భయపడి.. చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారు'
author img

By

Published : Feb 12, 2021, 8:47 PM IST

నూతన వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్​ చేస్తూ.. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామ్మోహన్.. రైతు భరోసా దీక్షను చేపట్టారు. ఈ నిరసనకు మద్దతుగా మాజీ మంత్రులు చిన్నారెడ్డి, ప్రసాద్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ యాదవ్​రెడ్డిలు హాజరయ్యారు.

ప్రభుత్వం.. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని రామ్మోహన్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తూ తీర్మానం చేయాలని సూచించారు.

రైతుబంధు పేరుతో కేసీఆర్ అన్నదాతలను మోసం చేశారని మాజీ మంత్రి చిన్నారెడ్డి విమర్శించారు. కేంద్రానికి భయపడి.. చట్టాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: కేంద్రంపై రైతులు 'కిసాన్​ మహా పంచాయత్​' అస్త్రం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.