రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్‌లో భాగంగా వికారాబాద్ జిల్లాలో తెరాస, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు విడివిడిగా ఆందోళనలు చేపట్టాయి. ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ ఆధ్వర్యంలో ప్లైఓవర్‌పై బైఠాయించారు. వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చౌరస్తాలో నిరసన తెలిపారు.
రామ్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులకు, కాంగ్రెస్ నాయకులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. మూడు గంటల వరకు బంద్‌లో పాల్గొనాలని సీఎం చెప్పారని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అందరినీ బంద్‌లో పాల్గొనాలని పిలుపునిచ్చి... కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడం విచారకరమని రామ్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలి: మహమూద్ అలీ