వికారాబాద్ జిల్లాలో పుట్టగోడుగుల మాదిరిగా వెలసిన రిసార్టుల్లో ఎలాంటి రక్షణ లేకపోవడం వల్ల...తరచుగా ప్రమాదాలు జరిగి మరణాలు సంభవిస్తున్నాయి. గోదుమగూడ సమీపంలోని హిల్స్ అండ్ వ్యాలీ రిసార్టులో మౌంటెన్ బైక్పై నుంచి పడి ఓ ప్రవాస భారతీయుడు మృతి చెందాడు. హైదరాబాద్కు చెందిన అరవింద్ అమెరికాలో నివాసాముంటున్నాడు. ఈ మధ్యనే అమెరికా నుంచి వచ్చిన ఆయన ఆదివారం తన స్నేహితులతో కలిసి రిసార్టుకు చేరుకున్నాడు. సోమవారం మధ్యాహ్నం బైక్ రెసింగ్ చేస్తూ ఒక్కసారిగా కింద పడిపోయి అక్కడిక్కడే మరణించాడు. గుట్టు చప్పుడు కాకుండా... మృతదేహాన్ని వికారాబాద్ మార్చురికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హెల్మెట్ ఇవ్వకపోడం వల్లే అరవింద్ చనిపోయినట్లు తెలుస్తోంది.
ఇవీ చూడండి:'మహా' వర్షాలకు 48 గంటల్లో 50 మంది బలి