ETV Bharat / state

ఉపాధి హామీ కూలీలూ ! మాస్కులు తప్పనిసరి - POUSOMI BASU TALKS TO WORKERS

వికారాబాద్ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ పౌసమీ బసు.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని ఉపాధి హామీ కూలీలకు సూచించారు. భౌతిక దూరం కూడా ఉండేలా ఎవరికి వారే జాగ్రత్తలు వహించాలని తెలిపారు.

భౌతిక దూరం లేకుంటే పనుల్ని నిలిపివేస్తాం : కలెక్టర్

author img

By

Published : Apr 21, 2020, 6:01 PM IST

వికారాబాద్ జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పనులను కలెక్టర్ పౌసమీ బసు పరిశీలించారు. కుల్కచర్ల మండలంలోని పిరంపల్లి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. కరోనా వైరస్ నివారణ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూలీలకు వివరించారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్నారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటికే 38 కరోనా కేసులు నమోదయ్యాయని కలెక్టర్ స్పష్టం చేశారు. వికారాబాద్ పట్టణం రెడ్ జోన్ లో ఉన్నందున... ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరో వైపు ఐకేపీ ద్వారా ఇప్పటికే పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని కలెక్టర్ అన్నారు. వాటి ద్వారా రైతులు ధాన్యం అక్కడే అమ్ముకోవచ్చని సూచించారు. ధాన్యం కొనుగోలు దగ్గర కూడా టోకెన్లు పంపిణీ చేస్తామని, టోకెన్ల వారిగానే వెళ్లి ధాన్యం అమ్మకాలు జరపాలని సూచించారు. రైతులకు ధాన్యం సంచుల కొరత వల్ల గ్రామాల్లో ఒకరి తర్వాత ఒకరు సంచులను వాడుకోవాలని కోరారు.

ఇవీ చూడండి : రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.