భూగర్భ జలాల నిల్వ సంరక్షణలో జిల్లాకు జాతీయ స్థాయిలో మూడో స్థానం లభించిందని వికారాబాద్ కలెక్టర్ పౌసుమి బసు తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీసు కవాతు మైదానంలో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండా ఎగురవేశారు.
కొవిడ్ దృష్ట్యా గణతంత్ర్య వేడుకలు నిరాడంబరంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ అన్నారు. కరోనాను 11నెలల పాటు సమిష్టి కృషితో కట్టడి చేయగలిగామని తెలిపారు. లాక్డౌన్లో ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని కంది పంట దిగుబడిలో జిల్లా నుంచి 44శాతం ఉంటుంది. మొత్తం 21.47లక్షలతో అర్హులకు పింఛన్లు పంపిణీ చేస్తాం. కొవిడ్ కారణంగా 50,408 మంది విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు అందుబాటులోకి తెచ్చాం. -పౌసుమి బసు, కలెక్టర్
పోలీసుల కవాతు, విద్యార్థుల నృత్యాలు అందరిని అలరించాయి. విధినిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు.. సేంద్రియ వ్వవసాయం చేస్తున్న పరిగి మండలం సుల్తాన్‌పూర్‌కు చెందిన శ్రీనివాస్, వికారాబాద్ కేంద్రం కొత్తగడికి వాసి మల్లారెడ్డికి ప్రశంసా పత్రాలు అందజేశారు.
ఇదీ చూడండి: కాంగ్రెస్ త్యాగాలతోనే స్వాతంత్య్రం వచ్చింది: ఉత్తమ్