ఇటీవలి కాలంలో బాగా వైరల్ అవుతున్న పాట బుల్లెట్టు బండి(Bullettu bandi). ఈ పాట మొదట యూట్యూబ్‌లో(youtube) విడుదలై మంచి ఆదరణ పొందింది. పెళ్లి కూతురు డ్యాన్స్ చేయడంతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఆ పాట చిన్నాపెద్దా అని తేడా లేకుండా అందరినీ ఎంతో ఆకట్టుకుంటోంది. ఈ విషయాన్ని గమనించిన వికారాబాద్ జిల్లా భోంరాస్‌పేట మండలం దుద్యాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు పండితులు సుధాకర్.... ఈ పాటతోనే విద్యార్థులను పాఠశాలలకు రప్పించాలని భావించారు.
బుల్లెట్టు బండి పాట సంగీతానికి అనుగుణంగా... పిల్లలు బడికి రావడానికి ప్రోత్సహించేలా లిరిక్స్ రచించారు. అంతేకాకుండా ఆ సంగీతానికి తగిన స్వరంతో పాటను ఆలపించారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఎంతోమంది తమ ప్రతిభను కనబర్చుతారు. అయితే ట్రెండ్‌కు తగ్గట్టు... విద్యార్థులు బడికి హాజరవడాన్ని ప్రోత్సహించేలా ఈ తెలుగు ఉపాధ్యాయుడు చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంటోంది(viral song). సామాజిక మాధ్యమాల్లో(social media) హల్‌చల్ చేస్తోంది. డుగ్గు.. డుగ్గు... పాఠశాల పాటను మీరూ ఓసారి వినండి మరి..!
ఇదీ చదవండి: Rains In Hyderabad: తడిసిముద్దైన భాగ్యనగరం.. కాలనీలు జలమయం!