భారీవర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లడం సహజం. తరువాత నీరు తగ్గి మళ్లీ మామూలుగా రాకపోకలు సాగుతుంటాయి. కానీ, వంతెన పనులు సకాలంలో పూర్తిచేయక కొద్దిపాటి వర్షం పడినా వాగు పొంగి ప్రజలకు కష్టాలు తప్పడంలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితి వికారాబాద్ జిల్లాలోని పెద్దేముల్ మండల పరిధి కందనెల్లి వాగు (Kandanelli Vaagu) వద్ద నెలకొంది.
ఇక్కడి ఇక్కట్లు తొలగించాలనే సర్కారు రెండేళ్ల క్రితం వంతెన నిర్మాణం చేపట్టింది. అయితే.. అధికారుల పర్యవేక్షణ లోపం, గుత్తేదారు ఇష్టారాజ్యంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఫలితంగా వర్షం పడితే చాలు.. వాగు ఉద్ధృతి పెరిగి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దాటాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో వంతెన నిర్మాణం వేగంగా పూర్తిచేసి తమ ఇబ్బందులు తొలగించాలని ప్రజలు వేడుకుంటున్నారు. వంతెన లేక ప్రాణాలు పణంగా పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఇవీ చూడండి :
Miserable condition: ఓవైపు పురిటి నొప్పులు.. మరోవైపు పొంగుతున్న వాగు!
bus gets stuck in flood: వరదే కదా.. ఏం కాదులే అనుకున్నాడు..
'సిద్దిపేట- హన్మకొండ' ప్రధాన రహదారిపై పొంగిన వాగు.. స్తంభించిన రాకపోకలు
వాగు ఉద్ధృతికి కొట్టుకుపోయిన కార్లు.. నవవధువు సహా ఆరుగురు గల్లంతు