ETV Bharat / state

హృదయాల్లో వేదన.. కన్నీటి నివేదన - corona latest news

కరోనాతో బంధాలు కనుమరుగవుతున్నాయి. వైరస్​తో చనిపోతే అంత్యక్రియలకు బంధువులు దూరమవుతున్నారు. వైరస్‌ సోకి మరణిస్తే వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

corona
హృదయాల్లో వేదన.. కన్నీటి నివేదన
author img

By

Published : Apr 17, 2021, 8:53 AM IST

  • వారం కిందట వికారాబాద్‌ పట్టణంలో పేరున్న వ్యాపారికి కరోనా సోకి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతదేహాన్ని నేరుగా శ్మశానవాటికకు తరలించి అంత్యక్రియలు పూర్తిచేశారు. పలువురికి సహాయం చేసిన ఆయన చివరి మజిలీకి నలుగురు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు.
  • వికారాబాద్‌ పట్టణానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి తల్లికి పాజిటివ్‌ వచ్చింది. హైదరాబాద్‌ ఆస్పత్రిలో చేర్పించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు, బంధువర్గం పెద్దఎత్తున్న ఉన్నా, ఎవరూ లేని అనాథగా అంత్యక్రియలు నిర్వహించారు.

ఇలా.. వికారాబాద్​ జిల్లాలో పేరున్న వ్యాపారులు, రాజకీయ నాయకులు కరోనాతో మృత్యువాత పడితే హితులు, సన్నిహితులు, బంధువులు, గ్రామస్థులు హాజరు కావడంలేదు. ఎవరూ లేని వారిలా గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. రక్త సంబంధీకులు రాలేని పరిస్థితి. వారంతా హృదయంలో వేదన నింపుకొని, కన్నీటిని నివేదిస్తున్నారు. పరపతి, పలుకుబడి ఉన్న పలువురు రాజకీయ నాయకులు, ఇతరులు ఈ వ్యాధితో మృతి చెందితే అనాథ మృతదేహాల మాదిరిగా కార్యక్రమాలు నిర్వహించిన తీరు తాజా పరిస్థితికి అద్ధం పడుతోంది. ప్రస్తుతం ఆ ‘నలుగురు’ కాస్తా దూరం అవుతున్నారు. కడసారి చూపు చూసి, కన్నీరు కార్చే వీలులేకుండా పోయింది. కొవిడ్‌ రెండోదశ విస్తరించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.

దూరంగానే కడసారి చూపు..: బంధువుల్లో ఎవరైనా చనిపోతే కడసారి చూపు చూసి.. చేసిన మంచి పనులు తలుచుకుని కీర్తిస్తారు. నేడు ఆ పరిస్థితి లేదు. ఎంత గొప్ప వ్యక్తయినా పట్టుమని పది మంది లేకుండానే.. ఊరేగింపు జరగకుండానే కార్యక్రమాన్ని ముగించాల్సి వస్తోంది. ఇంట్లో ఉన్న పెద్దదిక్కును కోల్పోయినా ఇదే పరిస్థితి. కర్మకాండలకు కూడా ఎవరూ రాని దయనీయ పరిస్థితి ఏర్పడింది. మహమ్మారి మానవ జీవితాలకు బంధనాలు విధించింది. పెళ్లయినా, చావయినా.. ఏ ఇతర శుభకార్యమైనా అతితక్కువ మందితో ముగించేలా చేసింది.

మారిన కర్మకాండల విధానం..: ఎవరి ఆచారాల ప్రకారం వారు ఆత్మీయుల కర్మకాండలు జరుపుకోవడం పరిపాటి. దహన సంస్కారాల అనంతరం మూడోరోజు, ఐదోరోజు, తొమ్మిదోరోజు, 11వ రోజని ఎవరి సంప్రదాయం ప్రకారం వారు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం పరిమిత సంఖ్యలో బంధువుల మధ్య ఈ తంతు కొనసాగుతోంది.

భయాందోళనతో..: కరోనాతో చనిపోయినా, సాధారణ కారణాలతో మృతి చెందినా అత్యంత ఆప్తులు దగ్గరకు రాలేకపోతున్నారు. సాధారణ సమయంలో ఆత్మీయులు చనిపోతే మృతదేహం వద్దకు వచ్చి బోరున ఏడ్చేవారు. బాధతో ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఓదార్చుకునే వారు. ప్రస్తుతం భౌతికదూరం పాటించడంతో దూరంగా నిలబడాల్సిన పరిస్థితి. మళ్లీ పాత రోజులు ఎప్పుడు వస్తాయోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఎవరికి వారు అప్రమత్తంగా ఉండి, నిబంధనలు పాటిస్తేనే వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయవచ్చని అవగాహన కల్పిస్తున్నా మార్పు రావడంలేదు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.