రాష్ట్రంలో ప్రధాన గిరిజన తెగ అయిన లంబాడాలు పేదరికం కారణంగా తమ ఆడ పిల్లలను అమ్ముకోవడం లేదా చపడం లాంటివి చేస్తున్నారని మాజీ మంత్రి, భాజపా నేత రవీందర్ నాయక్ అన్నారు. ఈ నెల 23న ఆల్ ఇండియా ట్రైబల్ ఫెడరేషన్ అధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కేంద్రంలో జరిగబోయే గిరిజన గర్సజన సమావేశ గోడపత్రికను ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకన్నతో కలిసి ఆయన విడుదల చేశారు.
రాష్ట్రంలో కేసీఆర్ నియంతపరిపాలన కొనసాగిస్తున్నారని రవీందర్ నాయక్ విమర్శించారు. నీరు, నిధులు, నియామకాలు అనే నినాదంతో సాధించిన తెలంగాణలో మనవడికి తప్ప కుటుంబంలో అందరికి ఉద్యోగాలు ఇచ్చారని ఎద్దేవా చేశారు. పౌష్టికాహార లోపం, ఆకలితో ప్రజలు అలమటిస్తోంటే.. నీళ్లను ఫాం హౌస్ కు తరలించుకున్న సీఎం నిధులను తన ఇంటికి తరలించి తన కుటుంబాన్ని బంగారు కుటుంబం చేసుకున్నారని అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానన్న మఖ్యమంత్రి ఇప్పుడు లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించేందుకు గోండులను ఉసిగోల్పి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. లంబాడాలను ఏకంచేసి వారిని బలవంతులను చేస్తానని పేర్కొన్నారు. కేసీఆర్ మెడలు వంచైనా రిజర్వేషన్లను సాధిస్తామని రవీందర్ నాయక్ అన్నారు.
ఇదీ చదవండి : రైతులకు మద్దతుగా దిల్లీ వెళ్లి దీక్షలో పాల్గొంటా: వీహెచ్