ETV Bharat / state

న్యాయవాద దంపతుల హత్యలపై సీఎం స్పందించరేం: బండి - తెలంగాణ తాజా వార్తలు

పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాద దంపతుల హత్యలపై గవర్నర్, హైకోర్టు స్పందించినా.. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎందుకు స్పందించడం లేదో చెప్పాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ డిమాండ్​ చేశారు. వికారాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన దీక్షకు సంజయ్ మద్దతు తెలిపారు.

bandi sanjay
న్యాయవాద దంపతుల హత్యలపై సీఎం స్పందించరేం: బండి
author img

By

Published : Mar 2, 2021, 2:31 PM IST

పెద్దపల్లి జిల్లాలో ఇద్దరు న్యాయవాదులను హత్యచేసినా... ముఖ్యమంత్రి కేసీఆర్​ ఎందుకు స్పందించడం లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ ప్రశ్నించారు. ఈ హత్యలను హైకోర్టు సుమోటోగా తీసుకుందని, గవర్నర్​ తమిళిసై ఖండించారన్నారు.

వికారాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదుల నిరసన దీక్షకు ఆయన మద్దతు తెలిపారు. వామనరావు దంపతుల హత్యలపై హైకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు. రాష్ట్రంలోని న్యాయవాదులకు రక్షణ కల్పించాలన్నారు. నిరసన దీక్షలకు కేసీఆర్​ దిగిరారని.. ఆందోళనలను ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఉందని న్యాయవాదులకు సూచించారు.

న్యాయవాద దంపతుల హత్యలపై సీఎం స్పందించరేం: బండి

ఇవీచూడండి: లాయర్​ దంపతులను హతమార్చిన రెండు కత్తులు లభ్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.