రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం నిరంకుశ పాలన కొనసాగిస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేసి.. తెరాసకు సరైన సమాధానం చెబుతామని స్పష్టం చేశారు.
ఎన్నికల నేపథ్యంలో హన్మకొండలో పార్టీశ్రేణులతో కోదండరాం సమావేశమ్యారు. ఒకట్రెండు రోజుల్లో తమ పార్టీ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. ప్రజల అభివృద్ధి కాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తామని కోదండరాం పేర్కొన్నారు.
ఇవీ చూడండి: ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా ఎత్తుగడలు