రంగులతో రోగాలు?
డబ్బులు ఎంత ఖర్చైనా ఫర్వాలేదు కానీ ఒక్కసారి పూస్తే ఆ రంగు అలాగే కనిపించాలని కోరుకుంటారు చాలా మంది. అలాంటివాటినే ఏరికోరి కొనుక్కుంటారు. కంటికింపుగా కనపడగానే మరో ఆలోచన లేకుండా తీసేసుకుంటారు. కృత్రిమంగా తయారైన రంగుల్లో రసాయనాలుంటున్న విషయాన్ని పట్టించుకోవడం లేదు.
ప్రేమగా స్నేహితులకు బంధువులకు, సన్నిహితులకు చల్లిన కృత్రిమ రంగులతో ఎన్నో రకాల చర్మవ్యాధులు చుట్టుముడుతున్నాయి. కళ్లల్లో పడితే ఇక వారి పని అంతే. వీటిలో వాడే రసాయనాలతో చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు జలుబు, దగ్గు, మంట వస్తాయి. ఒంటికి అంటుకున్న రంగు కనీసం రెండు మూడ్రోజులు రుద్దినా పోదు. డబ్బులు పెట్టి అనారోగ్యం కొనుక్కోవడం కంటే ఇంట్లో ఉండే కూరగాయలు, పిండి పదార్థాలతో సహజ సిద్ధమైన రంగులు తయారు చేసుకొని హోలీని ఆనందంగా, ఆరోగ్యంగా జరుపుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
ఇవీ చదవండి:భారత్ భేరి: చిన్నోళ్లైనా చితక్కొడతారట