ETV Bharat / state

లండన్ వీధుల్లో బోనాల సందడి

బోనాల వైభవం లండన్ నగరాన్ని తాకింది. స్థానిక తెలంగాణ వాసులు.. క్రాంఫర్డ్ కళాశాల ఆవరణలో ఈ వేడుక నిర్వహించారు. బ్రిటన్​లోని తెలంగాణ వాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రాయబార ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు.

లండన్​లో బోనాలు
author img

By

Published : Jul 8, 2019, 11:37 PM IST

హైదరాబాద్​లోనే కాదు.. లండన్​లోనూ బోనాల సందడి మొదలైంది. తెలంగాణ ఎన్నారైఫోరం ఆధ్వర్యంలో క్రాంఫర్డ్ కళాశాల ఆవరణలో వేడుకలను ఆదివారం నిర్వహించారు. బ్రిటన్ నలుమూలల నుంచి సుమారు 600లకు పైగా తెలంగాణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. వేడుకలో లండన్ ఎంపీ వీరేంద్రశర్మ, సీమ మల్హోత్రా, భారత రాయబార కార్యాలయం ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఎనిమిదేళ్లుగా ఏటా ఈ వేడుక జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలంగాణ ఎన్నారై ఫోరం ఛైర్మన్ గంప వేణుగోపాల్ అన్నారు. ఇంగ్లాండ్ గడ్డపై తన నియోజకవర్గంలో బోనాలు నిర్వహించడం... హిందూ సంప్రదాయాల్లో భాగస్వామ్యం అవ్వడం సంతోషకరమని లండన్ ఎంపీ సీమా మల్హోత్రా ఆనందం వ్యక్తం చేశారు.

లండన్ వీధుల్లో తొట్టెల ఊరేగింపు

వేడుకలో స్థానిక లక్ష్మీనారాయణ గుడిలో మహిళా సభ్యుల ఆధ్వర్యంలో దుర్గా మాతకు బోనం సమర్పించి, లండన్ వీధుల్లో తొట్టెలు, బోనాలతో శోభాయాత్ర నిర్వహించారు.

ఇదీ చూడండి : పోర్చుగల్​ 'బతుకమ్మ పండుగ' గురించి తెలుసా?

Intro:hyd_tg_pargi_63_08_odf_gramalu_ab_ts10019
పాలన అధికారి ఆదేశాల మేరకు ఓ డి ఎఫ్ గ్రామాలుగా తీర్చడం కోసం రాత్రి పగలు తేడా లేకుండా మరుగుదొడ్ల నిర్మాణం దగ్గరుండి పర్యవేక్షిస్తున్న అధికారులు

Body:వికారాబాద్ జిల్లా పరిగి .పాలనా అధికారి మస్రత్ కాణం అయేషా ఆదేశాల మేరకు ప్రతి గ్రామం ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లో ఉండే మరుగుదొడ్ల నిర్మాణాలు పర్యవేక్షిస్తున్న అధికారులు గ్రామంలో వంద శాతం మరుగుదొడ్లు నిర్మించాలని ప్రజలలో మరుగుదొడ్ల పై పూర్తి అవగాహన కల్పించి ప్రతి ఇంటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు కులకచర్ల మండల ముజాహిద్ పూర్ గ్రామంలో లో సోమవారం రాత్రి ఎంపీడీవో ఇంద్రసేన స్వయంగా దగ్గరుండి పనులను పర్యవేక్షించారు కులక్చర్ల మండలంలోని 52 గ్రామ పంచాయతీలకు గాను 44 గ్రామపంచాయతీలు ఓడిఎఫ్ గ్రామాలుగా తీర్చిదిద్దాం మిగతా ఎనిమిది గ్రామాలను కూడా మరో రెండు రోజుల్లో పూర్తి చేస్తామని ఉన్నారు ఈ కార్యక్రమంలో లో ఎం పి డి ఓ ఇంద్రసేన ముజాహిద్పూర్ గ్రామ సర్పంచ్ లక్ష్మీ ఆనంద్ పంచాయతీ సెక్రటరీలు పాల్గొన్నారు .
బైట్.
01.కుల్కచర్ల ఎంపీడీవో ఇంద్రసేన

Conclusion:శ్రీనివాస్ పరిగి కంట్రిబ్యూటర్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.