నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం సాటపూర్గేట్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పుష్పలతను ప్రసవం కొరకు బోధన్ ఏరియా ఆసుపత్రికి తీసుకరాగా మంగళవారం మధ్యాహ్నం మగ బిడ్డకు జన్మనిచ్చిందని వైద్యులు తెలిపారు. తల్లి క్షేమంగా ఉందని మొదట్లో చెప్పిన వైద్యులు ప్రసవం అయిన రెండు గంటల తర్వాత ఫిట్స్ వచ్చాయని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉందని నిజామాబాద్ తీసుకుని వెళ్లాలని వైద్యులు సూచించడం వల్ల అక్కడికి తీసుకుని వెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని అక్కడి వైద్యులు చెప్పారని మృతురాలి సోదరి వివరించారు. బోధన్‌లోని వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని మృతురాలి సోదరి ఆరోపించారు.
ఇవీ చూడండి: 'పది నిమిషాలు ముందెళ్తే నా కొడుకు బతికేవాడు'