సూర్యాపేట జిల్లా నూతనకల్‌లో యూరియా కోసం రైతులు ఇక్కట్లు పడుతూనే ఉన్నారు. నూతనకల్ సహకార పరపతి సంఘానికి గురువారం 442 బస్తాలు యూరియా వచ్చింది. ఒక్కొక్కరికి రెండు బస్తాల యూరియా ఇవ్వాలని నిర్వాహకులు నిర్ణయించుకుని పంపిణీ మొదలు పెట్టారు. 200 బస్తాలు అందించిన తర్వాత అనూహ్యంగా సుమారు 300 మంది అన్నదాతలు యూరియా కోసం వచ్చారు. నిలువ 150 బస్తాలు మాత్రమే ఉండడం వల్ల యూరియా బస్తాలకోసం రైతుల మధ్య తోపులాట జరిగింది.
ఇవీచూడండి: కరెంట్ షాక్ తగిలి కలకత్తా యువకుడు మృతి