ETV Bharat / state

'మద్దతు ధరలో ఎలాంటి కోత విధించకుండా ప్రతిగింజను కొనుగోలు చేయాలి' - సూర్యాపేట జిల్లా తాజా వార్తలు

YS Sharmila Padayatra:రాష్ట్రంలో ధాన్యం పండించే రైతుల ఇబ్బందులకు ముమ్మాటికీ సీఎం కేసీఆర్‌ కారణమని వైతెపా అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. మద్దతు ధరలో ఎలాంటి కోతలు లేకుండా ప్రభుత్వం ప్రతిగింజను కొనుగోలు చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు.

YS Sharmila
వైఎస్ షర్మిల
author img

By

Published : May 6, 2022, 5:59 PM IST

Updated : May 6, 2022, 7:01 PM IST

YS Sharmila Padayatra: రాష్ట్రంలో ఏ రైతు నష్టపోకుండా పూర్తి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వైతెపా అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. ప్రజాప్రస్థాన యాత్రలో భాగంగా సూర్యాపేట జిల్లాలోని వ్యవసాయ మార్కెట్​ను సందర్శించారు. అనంతరం అన్నదాతలతో మాట్లాడారు. మద్దతు ధర గురించి అడిగి తెలుసుకున్నారు.

మద్దతు ధర రావట్లేదంటూ రైతులు చెప్పడంతో మార్కెట్‌ కార్యాలయం ముందు వైఎస్ షర్మిల బైఠాయించారు. మార్కెట్​లో జరిగిన కొనుగోళ్లపై మార్కెట్ కార్యదర్శి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. 600 మందిలో కేవలం ఇద్దరికి మాత్రమే మద్దతుధర లభించడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

" యాసంగిలో తప్పుల మీద తప్పులు చేసింది కేసీఆర్. శిక్ష పడితే మొదట ఆయనకు శిక్ష పడాలి. ఏ రైతు నష్టపోకుండా పూర్తి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ధాన్యాన్ని కొనాలి. ఈ యాసంగిలో వరి వేసిన నుంచి అన్నదాతలు బిక్కుబిక్కుమంటూ గడిపారు. వడ్లు కొంటారా కొనరా అనే పరిస్థితి వారిలో నెలకొంది. సీఎం కేసీఆర్ మద్దతు ధర ఇచ్చి కొంటామని చెప్పారు. ఇప్పుడు కూడా మార్కెట్ కేంద్రాల్లో మద్దతు ధర లభించడం లేదు. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి కొన్నారు. కేవలం రైతుల ఓట్ల కోసమే రైతుబంధును ప్రవేశపెట్టారు. రుణమాఫీ చెస్తామన్న మాట నిలబెట్టుకోలేదు. ముఖ్యమంత్రి మాట నమ్మి వరి వెయ్యని అన్నదాతలకు నష్టపరిహారం చెల్లించాలి."

- వైఎస్ షర్మిల వైతెపా అధ్యక్షురాలు

ఇదీ చదవండి: SI Preparation Tips: ఎస్​ఐకి ఇలా ప్రిపేర్‌ అవ్వండి.. జాబ్‌ పక్కా మీదే!

డబ్ల్యూహెచ్ఓ నివేదికపై రాజకీయ దుమారం.. తప్పుపట్టిన 20 రాష్ట్రాల ఆరోగ్య మంత్రులు

Last Updated : May 6, 2022, 7:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.