ETV Bharat / state

నకిరేకల్, కోదాడలో మద్యం కోసం నారీమణుల క్యూ - womens stand in a que line for liquor

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు తెరుచుకోవడం వల్ల మద్యం ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది. పలు ప్రాంతాల్లో మద్యం కోసం మహిళలూ నిల్చోవడం విశేషంగా మారింది.

నకిరేకల్, కోదాడలో మద్యం కోసం నారీమణుల క్యూ

author img

By

Published : May 6, 2020, 11:58 PM IST

నెలన్నర తర్వాత మద్యం దుకాణాలు తెరవడం వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జనం మద్యం దుకాణాల ముందు వరుస కట్టారు. ఆరెంజ్ జోన్లో ఉన్న నల్గొండ, గ్రీన్ జోన్లో గల యాదాద్రి భువనగిరి జిల్లాల్లో... ఉదయం పదింటికే దుకాణాల్ని తెరిచారు.

సూర్యాపేట మార్కెట్ ప్రాంతంలో గల కంటెయిన్మెంట్ జోన్లోని రెండు మినహా... అన్ని చోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. నకిరేకల్, కోదాడ సహా పలు ప్రాంతాల్లో... మహిళలు వరుసలో నిల్చున్నారు. మునుగోడులోని దుకాణం ఎదుట మద్యం ప్రియులు... పాదరక్షలను ఉంచి వరుసలో నిల్చున్నారు. భౌతిక దూరం పాటించేందుకు ఏర్పాటు చేసిన మార్కింగ్ లోపల... పాదరక్షల్ని ఉంచడం చర్చనీయాంశంగా మారింది.

ఇవీ చూడండి : సీఎంకు కృతజ్ఞతలు చెబుతూ మందుబాబు ఆనందం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.