ETV Bharat / state

వేరే గ్రూపు రక్తం ఎక్కించి ప్రాణం తీశారు.. - వైద్యం వికటించి మహిళ మృతి

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో దారుణం జరిగింది. వైద్యం కోసం వచ్చిన మహిళను కాటికి పంపారు వైద్యులు. ఆమెకు ఏబీ పాజిటివ్​ గ్రూపు రక్తం బదులు మరో గ్రూపు రక్తం ఎక్కించటం వల్ల వైద్యం వికటించి ఆమె మృతి చెందింది.

Woman dies  proper medical treatment at Suryapet private hospital
వైద్యం వికటించి మహిళ మృతి
author img

By

Published : May 21, 2020, 11:24 AM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ పట్టణంలో ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో సరైన వైద్యం అందక మహిళ మృతి చెందింది. గరిడేపల్లి మండలం సర్వారం గ్రామానికి చెందిన భీమ పొంగు ముత్తమ్మకు అనారోగ్యం కారణంగా మే 14న కుటుంబ సభ్యులు హుజూర్​నగర్​లోని ఓ ప్రైవేట్​ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఆమెకు గర్భసంచి ఆపరేషన్ నిర్విహించారు.

ఆ సమయంలో ఆమెకు ఏబీ పాజిటివ్​ రక్తం ఎక్కించుటకు బదులు నిర్లక్ష్యంగా మరో గ్రూపు రక్తం ఎక్కించారు. దీనివల్ల ఆమె పరిస్థితి సీరియస్​ అయింది. వైద్యుల సూచనమేరకు ఆమెను ఖమ్మం పట్టణంలోని కిమ్స్​ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మృతురాలి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసుపత్రిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.