సూర్యాపేట జిల్లా నేరేడుచెర్ల మున్సిపాలిటీ పరిధిలో అన్ని రకాల వ్యాపార వాణిజ్య సముదాయాలు స్వచ్ఛందంగా లాక్డౌన్ ప్రకటించారు. శనివారం నుంచి ఆగస్టు 14 వరకు పూర్తి బంద్ పాటించాలని వర్తక వాణిజ్య వ్యాపార సంఘాల నేతలు నిర్ణయించారు. ప్రతి రోజు ఉదయం 10 గంటల వరకు పాలు, పండ్లు కూరగాయలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేశారు. ఆస్పత్రులు , మెడికల్ షాపులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
కుటుంబం ఆ తర్వాతే వ్యాపారం...
ముందు కుటుంబం అని ఆ తర్వాతే వ్యాపారమని వాణిజ్య సంఘాలు వెల్లడించాయి. ఎవరైనా లాక్డౌన్ను అతిక్రమించితే రూ.5000 జరిమానా విధిస్తామని మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు. అత్యవసరం అయితే స్పెషల్ టీం ఏర్పాటు చేస్తామని వివరించారు.
ఇవీ చూడండి : సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు : రాజు గంగపుత్ర