Sarpanch supplies Gudumba in Suryapet : ప్రజలు ఒక నాయకుడిని ఎన్నుకునేది వారికి మంచి చేస్తాడని. గ్రామాన్ని మంచి పథంలో నడిపిస్తారని. ఎన్నికల సమయంలో ప్రజాప్రతినిధులు ఇచ్చే హామీలు, చేసే వాగ్దానాలు మామూలుగా ఉండవు. ఏకంగా గాల్లో మేడలు కడతారు. ప్రజలకు ఎక్కడ లేనన్ని హామీలు ఇచ్చి నమ్మిస్తారు.
అమాయకపు ప్రజలు వారికి నమ్మి ఓటేస్తారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసలు కథ షురూ అవుతుంది. ఇచ్చిన హామీలు మరిచిపోతారు. మాట తప్పుతారు. కొందరైతే ప్రజల సొమ్ము దోచుకునే పనిలో పడతారు. ఇలా ఓ గ్రామ సర్పంచ్ కూడా ఎన్నికల్లో ఆ గ్రామ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. రోడ్లు వేయిస్తానని.. పారిశుద్ధ్యం బాగుండేలా చూస్తానని.. ఊరిలో పాఠశాల అభివృద్ధి చేస్తానని.. ఇలా లెక్కలేనన్ని హామీల వర్షం కురిపించారు. కానీ గెలిచిన తర్వాత టోటల్ రివర్స్‌గా ప్రవర్తించారు. ఇంతకీ ఆయన ఏం చేశారంటే..?
Sarpanch supplies Gudumba in Gopi tanda : గ్రామ ప్రథమ పౌరుడిగా తనను ఎన్నుకున్న ప్రజలకు సేవలు అందిస్తానని హామీలు ఇచ్చిన ఓ సర్పంచి అదే గ్రామానికి గుడుంబా సరఫరా చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న ఆబ్కారీ అధికారులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ట్రాక్టర్‌తో దూసుకెళ్లి హత్యాయత్నం చేశాడు. చివరకు ఎవరికీ దొరకకుండా పరారయ్యాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మోతె మండలం గోపతండా సమీపంలో చోటుచేసుకుంది.
మోతె మండలం గోపతండాకు చెందిన సర్పంచి కొర్ర తిరుపతి తన ట్రాక్టర్లో డ్రైవర్ గుగులోతు సురేశ్‌తో కలిసి కొద్దిరోజులుగా గ్రామంలో గుడుంబాతో పాటు దాని తయారీకి ఉపయోగించే నల్లబెల్లం సరఫరా చేస్తున్నాడు. ట్రాక్టర్లో మోతె నుంచి 950 కిలోల నల్లబెల్లం, 50 కిలోల పట్టిక, 22 లీటర్ల నాటు సారా తీసుకొని గ్రామానికి వెళ్తున్నారు.
పోలీసులపైనే తిరుగు దాడి : విషయం తెలుసుకున్న ఆబ్కారీ శాఖ సిబ్బంది ఆ ట్రాక్టర్‌ను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సర్పంచ్ చెప్పగానే ట్రాక్టర్ డ్రైవర్ సురేష్ ఆబ్కారీ పోలీసులపైకి వాహనంతో పాటు దూసుకెళ్లాడు. ఈ క్రమంలో హెడ్‌కానిస్టేబుల్ అప్సర్ అలీకి గాయలయ్యాయి. వెంటనే సర్పంచ్ తిరుపతి, డ్రైవర్ సురేశ్ ట్రాక్టర్ వదిలి పరారయ్యారు. వీరిపై మోతె పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం కేసు నమోదైంది.
ఇవీ చదవండి: