సరిహద్దుల్లో నిబంధనలు కఠినతరం చేయడంతో వాహనాల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. అత్యవసర వాహనాలు మినహా మిగతావాటిని ఈ-పాస్ ఉంటేనే అనుమతిస్తున్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం చెక్పోస్ట్ వద్ద ఈపాస్ లేని వారిని వెనక్కి పంపుతున్నారు.
మూడోరోజు సరిహద్దు వద్ద వాహనాల తాకిడి తగ్గుముఖం పట్టింది. పోలీసులు పకడ్బందీగా తనిఖీలు చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ కేవలం పాస్ ఉన్నవారినే అనుమతిస్తున్నారు. అత్యవసర సరుకు వాహనాలు, అంబులెన్స్ వాహనాలను మాత్రం మినహాయిస్తున్నారు.