సూర్యాపేట జిల్లా మోతె మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. పుచ్చకాయల కోసమని వెళ్లిన ఇద్దరు యువకులు చెక్ డ్యామ్‌లో పడి మృత్యువాత పడ్డారు. మోతె మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి వచ్చిన అఖిల్, సందీప్ పుచ్చకాయల కోసమని తోటకి వెళ్లి తిరుగు ప్రయాణంలో మార్గం మధ్యలో ఉన్న చెక్ డ్యామ్ వద్ద చేతులు కడుక్కోవడానికి దిగారు. ఇద్దరి వ్యక్తుల్లో ఒకరు చెక్ డ్యామ్‌లో పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో మరో వ్యక్తి కూడా పడిపోయి, ఇద్దరూ మృత్యువాత పడి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. చెక్ డ్యామ్‌లో విగతజీవులుగా ఉన్న యువకులను స్థానికులు గమనించి పోలీసులకు తెలియజేశారు. యువకులు మృత్యువాతతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఇవీ చూడండి: స్థానికుల స్వాగతం.. వైద్యురాలి కన్నీళ్లు..!