సూర్యాపేట జిల్లా హుజూర్నగర్లో తెరాస మున్సిపల్ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహించారు. స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా.. మంత్రి జగదీశ్ రెడ్డి హాజరయ్యారు. వకసగా అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తున్న తెరాస... త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెరాసతోనే పట్టణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. నియోజకవర్గ పరిధిలోని హుజూర్నగర్, నేరేడుచర్లలో గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, పార్టీ ఎన్నికల పరిశీలకులు తక్కెళ్లపల్లి రవీందర్, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: జలహారతి... మానేరులో సీఎం పూజలు