సీటు బెల్టు, హెల్మెట్ ధరించని ప్రయాణం ప్రమాదకరమని సూర్యాపేట జిల్లా ఇంఛార్జ్ రవాణా అధికారి సుభాష్ అన్నారు. ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్ వద్ద 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ అంశాలపై వాహనదారులకు అవగాహన కల్పించారు.
ప్రతి వాహనదారుడుకి పుష్పగుచ్చాలు, స్వీట్లు అందించి అవగాహన కల్పించారు. దేశవ్యాప్తంగా రోడ్డు భద్రతలో భాగంగా 65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు భద్రతా మాసోత్సవాలు చేపట్టినట్లు రవాణా అధికారి సుభాష్ తెలిపారు.
ఇదీ చూడండి: దూసుకెళ్తున్న మహిళా కానిస్టేబుళ్లు.. 'షి పాహి'లో అనుష్క