ETV Bharat / state

భర్త చనిపోయిన నెల రోజులకే భార్య మృతి

అనారోగ్యం వల్ల భర్త చనిపోయిన నెల రోజులకే.. భార్య రహదారి ప్రమాదంలో మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. యడవెల్లికి చెందిన రాధ ఈ నెల 23న నూతనకల్‌ నుంచి ఇంటికి ఆటోలో వెళ్తుండగా అదుపుతప్పి బోల్తాకొట్టింది. తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది.

Tragedy struck in Suryapet district
భర్త చనిపోయిన నెల రోజులకే భార్య మృతి
author img

By

Published : May 27, 2020, 2:40 PM IST

సూర్యాపేట జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అనారోగ్యం వల్ల భర్త చనిపోయిన నెల రోజులకే.. భార్య రహదారి ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన నూతనకల్ మండలంలోని యడవెల్లిలో చోటు చేసుకుంది. యడవెల్లి గ్రామానికి చెందిన పులకరం రాధ ఈ నెల 23న నూతనకల్‌ నుంచి ఇంటికి ఆటోలో వెళ్తుండగా యడవెల్లి శివారులోని చెరువు అలుగువద్ద అదుపుతప్పి బోల్తాకొట్టింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను హైదరాబాద్‌కు తరలించారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రాధ మృతి చెందింది. భర్త నెలరోజుల క్రితం సరిగ్గా ఇదేరోజు అనారోగ్యంతో మృతిచెందాడు. కుటుంబ పెద్దలు ఇద్దరు చనిపోవడం వల్ల.. పన్నెండేళ్ల కుమారుడు అనాథగా మారాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చూడండి: రైతులను నిండాముంచిన అకాల వర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.