ETV Bharat / state

సరిహద్దు ప్రాంతంలో చెక్​ పోస్ట్​ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ - suryapet district news

వారాంతం కావడంతో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ చెక్​ పోస్ట్ వద్ద వాహనాల తాకిడి అధికంగా మారింది. చెక్ పోస్ట్ వద్ద అర కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆంధ్రా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ-పాస్ ఉంటేనే పోలీసులు అనుమతిస్తున్నారు.

traffic jam at kodada ramapuram cheak post in suryapet district
రాష్ట్ర సరిహద్జు ప్రాంతంలో చెక్​ పోస్ట్​ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్
author img

By

Published : Jun 12, 2021, 3:03 PM IST

Updated : Jun 12, 2021, 4:17 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం క్రాస్ చెక్​ పోస్ట్ వద్ద వారాంతం కావడంతో వాహనాల తాకిడి అధికంగా మారింది. చెక్ పోస్ట్ వద్ద అర కిలోమీటరు మేర ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. ఆంధ్రా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఈ-పాస్ ఉంటేనే కోదాడ పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ- పాస్ లేని వాహనాలను వెనుక్కు పంపిస్తున్నారు.

వందల సంఖ్యలో వాహనాలు చెక్ పోస్ట్ వద్ద నిలిచిపోయాయి. గంటల కొద్దీ పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు చేసేదిలేక వెనుదిరిగి వెళ్తున్నారు. ఈ-పాస్ లేని వాహనాలకు అనుమతిలేదని కోదాడ రూరల్ సీఐ శివరామి రెడ్డి తెలియజేశారు. కొవిడ్ నిబంధనలు పాటించి, తమకు సహకరించాలని ప్రయాణికులకు పోలీసులు సూచించారు.

ఇదీ చూడండి: KCR: సినారె అజరామరం.. ఆయన సాహిత్యం విశ్వంభరం

Last Updated : Jun 12, 2021, 4:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.