ETV Bharat / state

కూలీల ట్రాక్టర్​ బోల్తా... ఒకరు మృతి, 16 మందికి తీవ్రగాయాలు - CRIME NEWS IN SURYAPET

మిరపతోటల్లో పనికి వెళ్లి వస్తున్న కూలీల ట్రాక్టర్ సూర్యాపేట ఏపూర్​ వద్ద​ బోల్తాపడింది. ప్రమాద సమయంలో ట్రాక్టర్​లో 32 మంది కూలీలుండగా... ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. మరో 16 మందికి తీవ్రగాయాలు కాగా... వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.

TRACTOR OVER TURNED... ONE DIED, 16 INJURED

author img

By

Published : Feb 5, 2020, 8:52 AM IST

సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం ఏపూరు వద్ద ప్రమాదం జరిగింది. కూలీలతో వస్తున్న ట్రాక్టర్​ బోల్తాపడింది. ముక్కుడు దేవులపల్లికి చెందిన 32 మంది కూలీలు నూతనకల్ మండలం మాచినపల్లిలోని మిరపతోటలకు కూలీకి వెళ్లి తిరిగి వస్తున్నారు. ఏపూర్ వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన మరో ట్రాక్టర్​ ఢీకొనగా... కూలీలతో ఉన్న ట్రాక్టర్​ బోల్తాకొట్టింది.

ప్రమాదంలో బయ్య లింగమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మరో 16 మంది కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూర్యాపేట జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

కూలీల ట్రాక్టర్​ బోల్తా... ఒకరు మృతి, 16 మందికి తీవ్రగాయాలు

ఇవీ చూడండి: మేడారంలో అపశృతి.. మూర్ఛవ్యాధితో ఇద్దరి దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.