నేటితో మూడో విడత ప్రాదేశిక ఎన్నికల ప్రచారం ముగియనుండటం వల్ల రాజకీయపార్టీలు ప్రచార జోరును పెంచాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అనంతగిరి మండలంలోని పాలవరం, చనుపల్లి, త్రిపురవరం గ్రామాల్లో పర్యటించారు. హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ పథకం ప్రజలకు అందట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అభ్యర్థిగా అనంతగిరి జడ్పీటీసీ స్థానానికి పోటీచేసిన బుర్ర సుధారాణిని ప్రకటించారు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి.
ఇదీ చూడండి : జేఏవో ఉద్యోగాల నియామకం కేసులో హైకోర్టు తీర్పు