విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం కల్మలచెరువులో ప్రచారం నిర్వహించిన ఉత్తమ్... జగదీశ్‌రెడ్డి హుజూర్నగర్ బార్లు, రెస్టారెంట్లలో రౌడీ మామూళ్లు వసూళ్లు చేశారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో ఉచితంగా పదిశాతం షేర్ తీసుకున్నారన్నారు. దాదాగిరి, గూండాగిరి చేయటం తప్ప.. జగదీశ్‌రెడ్డి చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. ఇదే విషయాన్ని కావాలంటే లిఖితపూర్వకంగా బాండ్ పేపర్పైనైనా రాసిస్తానని పేర్కొన్నారు. భూదందాలు చేస్తూ జీవనం సాగించే సైదిరెడ్డిని ఓడించి.. పద్మావతిని గెలిపించాలని ఉత్తమ్ కోరారు.
ఇవీ చూడండి:వేడెక్కిన హుజూర్నగర్: ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం