సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఉపఎన్నిక స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న(నవీన్)... మేళ్లచెరువు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రచారం చేయకుండా సీఐ శివరాంరెడ్డి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. అధిక శబ్దం వచ్చే సౌండ్ బాక్స్‌లు వాడొద్దని ఆంక్షలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచారం చేయకుండా అడ్డుపడుతున్నాడని సీఐ మీద ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఓడిపోతారనే భయంతోనే అడ్డుతగులుతున్నారని విమర్శించారు. ఇది ప్రజాస్వామ్యమా... రాచరికమా అని ప్రశ్నించారు.
ఇవీచూడండి: ఆర్టీసీపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష