సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రం పద్మశాలి కాలనీలో ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ధరావత్ రమేశ్ అనే వ్యక్తి ముద్ర బ్యాంక్ మేనేజర్‌గా పని చేస్తున్నారు. అతని భార్య సిండికేట్ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరు ఉద్యోగ నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడ్డారు.
పక్కింటి వారు చోరీ విషయాన్ని గుర్తించి ఇంటి యాజమానికి సమాచారం ఇచ్చారు. అతను వచ్చి పరిశీలించి పోలీసులకు సమాచారం అందించారు. మొత్తం రెండు లక్షల రూపాయల నగదు, ఆరు తులాల బంగారం, అర కిలో వెండిని దొంగలు అపహరించుకపోయినట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.