ట్రాక్టర్ బోల్తా పడి రైతు మృతి చెందిన ఘటన సుర్యాపేట జిల్లా తుంగతుర్తిలో చోటుచేసుకుంది. శనివారం రాత్రి మొండికుంట తండాలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కుంటలో వాహనం పడిపోయింది. ఈ ఘటనలో.. పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తున్న జగన్ (48) అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు.
పొలానికి వెళ్లిన వ్యక్తి ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనుమానంతో దారంతా గాలింపుచర్యలు చేపట్టారు. ప్రమాదవశాత్తు కుంటలో పడ్డ ట్రాక్టర్ను గుర్తించి మృతుడిని బయటకు తీశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: ఎదురొచ్చిన మృత్యువు.. చావులోనూ వీడని స్నేహం..