కరోనా వైరస్ దృష్ట్యా సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి గ్రామస్థులు సోమవారం ఒక స్వచ్ఛంద నిర్ణయానికి వచ్చారు. తమ గ్రామంలోకి ఏ ఒక్క వాహనం కూడా రావొద్దని, గ్రామం నుంచి ఎవరు బయటకు వెళ్లొద్దని తీర్మాణం చేసుకున్నారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై అడ్డంగా రాళ్లు వేసి వచ్చిపోయే వాహనాలను అడ్డుకున్నారు. లాక్డౌన్ పరిస్థితి అదుపులోకి వచ్చే వరకు వాహనదారులు సహకరించాలని గ్రామస్థులు కోరారు.
ఇదీ చూడండి: దేశవ్యాప్తంగా లాక్డౌన్... కరోనా కేసులు@471