సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచే కృష్ణా నదిలో స్నానమాచరించి స్వామివారి దర్శనం చేసుకుని.. అనంతరం తీర్ధ ప్రసాదాలను స్వీకరించారు.
ఇటు తెలంగాణ అటు సీమాంధ్ర ప్రాంతానికి దగ్గరలో ఉండటం వలన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు అన్నదాన సత్రంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ కొలువుదీరిన లక్ష్మీనరసింహస్వామి వారికి చాలా చరిత్ర ఉందని స్థానికులు చెబుతారు. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశాడని.. 41 రోజులు భక్తిశ్రద్ధలతో పూజిస్తే కోరికలు ఫలిస్తాయని భక్తుల నమ్మకం.